లాజిక్‌లు వెతుక్కుంటూ కూర్చుంటే మూవీని ఆస్వాదించలేం: శ్రీకాంత్ ఓదెల

నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. అయితే సినిమాలో కొన్ని సన్నివేశాల్లో లాజిక్స్ లేవంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్‌పై డైరెక్టర్ శ్రీకాంత్ స్పందించారు. సినిమాలోని ప్రతీ సీన్‌లోనూ లాజిక్‌లు వెతుక్కుంటూ కూర్చుంటే అసలు మూవీని ఎవరూ ఆస్వాదించలేరని స్పష్టం చేశారు. సినిమా అనేది కేవలం ఒక వినోదం, అనుభూతి మాత్రమేనని, ప్రతీదానికీ ప్రాక్టికాలిటీ ఆశించడం కరెక్ట్ కాదని ఆయన తేల్చిచెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕