లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్ సిరాజ్ రెండు వికెట్లు తీసి పోర్చుగల్ ఫుట్‌బాల్ ఆటగాడు డియోగో జోటాకు అంకితమిస్తున్నట్లు హావభావాలు ప్రదర్శించిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై సిరాజ్ స్పందించాడు. ‘డియోగో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. నేను పోర్చుగల్ జట్టు అభిమానిని. దీంతో భావోద్వేగానికి గురయ్యా. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. అందుకే వికెట్లు తీసి అలా అంకితం చేశా’ అని తెలిపాడు.