TG: సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తామంటే తాము ఊరుకోబోమని మాజీ మంత్రి హరీశ్ రావు ఇటీవల కామెంట్ చేశారు. అయితే హరీశ్ రావుకు వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. శనివారం ఆయన హుస్నాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. అసలు తాము సిద్దిపేట జిల్లాను తొలగిస్తామని ఎక్కడా చెప్పనేలేదని క్లారిటీ ఇచ్చారు. గతంలో జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగలేదని అన్నారు. ఈ మేరకు ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే పలు జిల్లాల హద్దులు మారుతాయని అన్నారు. అందుకు హరీశ్ రావు అంత బాధపడాల్సిన అవసరం లేదన్నారు.