ఓట్లు అడిగే హక్కు మీకు లేదు: ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి

TG: గత ప్రభుత్వం పౌరుల హక్కులను హరించిందని, వ్యక్తుల కుటుంబాల్లోకి తొంగిచూసి, బెదిరించి లొంగదీసుకోవాలని చూసిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. ప్రజల వ్యక్తిగత గోప్యతను హరించిన కేసీఆర్‌కు మళ్లీ ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ ఫోన్ ట్యాపింగ్ రాక్షస క్రీడలో ఎంతోమంది బలైపోయారని, జడ్జీలు, జర్నలిస్టులు, నటులు, రాజకీయ నేతలు ఇలా అన్ని వర్గాల ఫోన్లను ట్యాప్ చేశారని ఆయన విమర్శించారు. బాధితులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్