టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియాను ఓడించాలంటే అదృష్టం ఉండాలని ఇంగ్లాండ్ బ్యాటర్ ఫిలిప్ సాల్ట్ పేర్కొన్నాడు. టీ20 ఫార్మాట్‌లో భారత జట్టు బలమైనదని, వారిని ఓడించడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సాల్ట్ మాట్లాడుతూ, 'టీమిండియాను ఓడించాలంటే ఎవరికైనా కాస్త అదృష్టం ఉండాలి. వరల్డ్ కప్‌లో ఆ టీమ్ చాలా బలమైనది' అని వ్యాఖ్యానించాడు.