సెల్ టవర్ ఎక్కి యువ జంట హల్‌చల్

TG: సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో, తమ కుటుంబ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యువ జంట సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. ప్రేమ వివాహం చేసుకున్న కోల వరలక్ష్మీ, శ్రీకాంత్ దంపతులు తమ కుటుంబాలు తమను ఇంట్లోకి రానివ్వడం లేదని, ఆస్తి కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ సమస్యపై పోలీస్ స్టేషన్‌లో కేసు పెండింగ్‌లో ఉందని రూరల్ సీఐ శ్రీనివాస్, రాజగోపాల్ పేట ఎస్సై వివేక్ తెలిపారు.

సంబంధిత పోస్ట్