పుదుచ్చేరిలో క్రికెట్ శిక్షణ పొందుతున్న 19 ఏళ్ల ఏంజెల్ కంగావి టీ20 జట్టులో చోటు దక్కకపోవడంతో మనస్తాపం చెంది బుధవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రాజస్థాన్‌కు చెందిన ఈ యువతి చెన్నైలో జీఎస్టీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న కాశ్మీర్ కుమార్తె. ఆమె రాసిన లేఖలో తన చావుకు తానే కారణమని, ఇతరులను నిందించడం లేదని పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.