విరాట్ కోహ్లీని ఆరాధించే టీమిండియా యువ ఆటగాడు విహాన్ మల్హోత్రా అండర్ 19 క్రికెట్ జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 పరుగులు చేసి, కేఎల్ రాహుల్‌ను తలపించాడు. అమెరికా, న్యూజిలాండ్, జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లలోనూ రాణించాడు. 2007లో జన్మించిన విహాన్, తల్లిదండ్రుల ఇష్టానికి విరుద్ధంగా క్రికెట్ వైపు అడుగులు వేశాడు. విజయ్ మర్చంట్ ట్రోఫీలో పంజాబ్ తరఫున అండర్ 16లో మూడు సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలతో 978 పరుగులు చేసి బీసీసీఐ పురస్కారం అందుకున్నాడు.