AP: విజయవాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో డ్యూటీలో ఉన్న యువ వైద్యురాలు దీపిక అనుమానాస్పదస్థితిలో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. అనంతపురం జిల్లాకు చెందిన దీపిక, MBBS పూర్తి చేసి GGHలో మెడిసిన్ పీజీ చేస్తోంది. నిన్న రాత్రి నుంచి డ్యూటీలో ఉన్న ఆమె, తెల్లవారుజామున అపస్మారక స్థితిలో పడిపోగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతూ స్వయంగా ఇంజెక్షన్ తీసుకున్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. పూర్తి వివరాలు పోస్టుమార్టం నివేదిక తర్వాత వెలుగులోకి రానున్నాయి.