అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య

TG: మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అప్పు బాధతో యువరైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కౌడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పల్లె కృష్ణ (23)అనే యువకుడు అక్క పెళ్లికోసం, వ్యవసాయం చేయడానికి తెలిసినవారి దగ్గర అప్పు చేశాడు. అయితే పంటదిగుబడి ఆశించినంతగా రాలేదు. దీంతో అప్పు ఎలా తీర్చాలో తెలీక తీవ్ర మనస్తాపం చెంది ఉరేసుకుని ఆత్మహత్య చేసకున్నాడు. మృతుడి తండ్రి భిక్షపతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్