యంగ్ హీరో వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'నయనం' అనే లేటెస్ట్ వెబ్‌సిరీస్ ఈ నెల 19 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 వేదికగా స్ట్రీమింగ్ కానుంది. స్వాతి ప్రకాష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్‌లో పలువురు నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు. సస్పెన్స్, డ్రామా అంశాలు ప్రధానంగా ఉన్న ఈ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. అందులో ఉన్న డైలాగ్స్ మరింత ఆసక్తిని పెంచాయి.