బీహార్‌లో రోహ్తాస్‌లోని ససారాం సదర్ ఆసుపత్రిలో ఒక వింత సంఘటన చోటుచేసుకుంది. గౌతమ్ అనే యువకుడు మూడు పెద్ద కోబ్రా పాములతో చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చాడు. అందులో ఒక పాము అతన్ని కరిచినట్లు తెలిపాడు. ఆసుపత్రిలో పాములను చూసి రోగులు, సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. డాక్టర్ ప్రవీణ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. గౌతమ్ ప్రమాదం నుండి బయటపడ్డాడని, పాము కాటుకు గురైనవారు వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని, మంత్ర విద్యను ఆశ్రయించవద్దని సూచించారు.