తన సోదరిని వేధిస్తున్న గ్యాంగ్‌ను నిలదీసినందుకు 19 ఏళ్ల యువకుడిపై దుండగులు సుత్తి, కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘటన హర్యానాలోని ఫతేపూర్ బిల్లోచ్ గ్రామంలో జరిగింది. ఈ దాడిలో యువకుడికి తీవ్ర గాయాలై, శరీరంలో పలుచోట్ల ఎముకలు విరిగాయి. ప్రస్తుతం బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు.