ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక యువకుడిని ఇద్దరు వ్యక్తులు విచక్షణారహితంగా కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి బాధిత యువకుడిని వెనుక నుంచి పట్టుకోగా మరో వ్యక్తి కర్రతో చితకబాదాడు. ఒక చిన్న వివాదం కారణంగా ఆ యువకుడిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు గాయపడిన వ్యక్తిని ఆసుపత్రిలో చేర్పించారు.