TG: హైదరాబాద్లోని రాజేంద్రనగర్ డీసీపీ జోన్ పరిధిలో వసీం అనే యువకుడిని స్నేహితులే కత్తులతో దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. స్నేహితుల మధ్య డ్రగ్స్ వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని లీక్ చేస్తున్నాడనే అనుమానంతో మొదలైన వాగ్వాదం చివరకు హత్యకు దారితీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.