హైదరాబాద్‌లో ప్రేమలో విఫలమైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాయదుర్గం ల్యాంకో హిల్స్‌లో ప్రైవేట్ కంపెనీ ప్రోగ్రామ్ మేనేజర్‌గా పనిచేస్తున్న వాలివేటి హితేష్(29) గురువారం తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ప్రేమ విఫలమవడంతో మానసిక ఒత్తిడికి లోనై ఈ నిర్ణయం తీసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. హితేష్ సోదరుడు ప్రమోద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.