AP: విశాఖ కంచరపాలెంలో విషాదం చోటుచేసుకుంది. కార్తీక్ (22) అనే యువకుడు ఇన్స్టాగ్రామ్ లైవ్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు లైవ్లో స్నేహితులకు తెలిపినట్లు సమాచారం. గతంలోనూ అతడు ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిసింది. ఘటనకు ముందు స్నేహితులకు ఫోన్ చేసినట్లు సమాచారం. కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.