ఫొటోలు దిగుతూ ప్రమాదవశాత్తు నదిలో పడి యువకుడు మృతి

TG: ఫొటోలు దిగుతూ ప్రమాదవశాత్తూ ఓ యువకుడు నదిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం కౌల్పూర్ గ్రామానికి చెందిన రామావత్ సాయికిరణ్ (25) గత నెల UK నుండి స్వగ్రామానికి వచ్చాడు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం వంతెనపై ఫొటోలు తీసుకుంటూ ప్రమాదవశాత్తు గోదావరి నదిలో పడిపోయాడు. గాలింపు చేపట్టగా బుధవారం మృతదేహం లభించింది. కాగా సాయికిరణ్ ఈనెల 5న యూకే వెళ్లాల్సి ఉండగా అంతలోనే విషాదం నెలకొంది.

సంబంధిత పోస్ట్