బైక్ గుంతలో పడి యువకుడు మృతి

AP: గుంతలమయమైన బొబ్బిలి-రామభద్రపురం రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. గొర్లెసీతారాంపురం గ్రామ సమీపంలో బైక్‌ గుంతలో పడటంతో అదుపుతప్పి కిందపడిన గొల్లపల్లి సాయికృష్ణ (25) తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే బొబ్బిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. స్నేహితుడితో కలిసి రామభద్రపురం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కొద్ది గంటల క్రితమే తమతో మాట్లాడిన కుమారుడు ఇక లేడన్న వార్తతో సాయికృష్ణ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕