TG: డీజే సౌండ్‌కి మరో గుండె ఆగింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం సింగాటం గ్రామంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్థానికంగా డీజే సౌండ్ ఏర్పాటు చేశారు. డీజే ఆపరేటర్‌గా పనిచేస్తున్న బండారు దినేష్ (25) డీజే ప్లే చేస్తుండగా ఛాతినొప్పితో ఒక్కసారిగా కుప్పకూలాడు. గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యుల వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.