రీల్స్ కోసం ఓ యువకుడు రైలు పట్టాలపై స్కేటింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో స్పీడుగా వెళ్తున్న రైలు టాప్ పైకి ఎక్కి ఓ యువకుడు స్కేటింగ్ చేస్తున్నాడు. పక్కనే రైలులో వెళ్తున్నవారు వీడియో తీస్తున్నట్టుగా అందులో కనిపిస్తోంది. యువడుకు స్పీడుగా స్కేటింగ్ చేస్తూ సడన్‌గా అదుపుతప్పి కింద పడిపోయాడు. ఈ క్రమంలో అతని తలకి దెబ్బతగిలినట్టు అందులో కనిపిస్తోంది. అయితే ఇది నిజంగా జరిగిన స్టంటా? లేకపోతే AI క్రియేషన్‌నా? అన్నది సోషల్ మీడియాలో చర్చగా మారింది.