యువకుడిని చంపి ఇసుకలో పూడ్చిపెట్టారు (వీడియో)

AP: నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలంలో తాజాగా దారుణ ఘటన చోటు చేసుకుంది. విరువూరు పెన్నా పరీవాహక ప్రాంతంలో చందు అనే యువకుడిని అతడి స్నేహితులు దారుణంగా కొట్టి చంపారు. అనంతరం మృతదేహాన్ని ఇసుకలో పూడ్చిపెట్టారు. కాగా, రెండు రోజుల నుంచి కొడుకు కనిపించలేదని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్