ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణం జరిగింది. లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవాలన్న తన కోరికకు తల్లి అభ్యంతరం చెప్పడంతో 17 ఏళ్ల మైనర్ ఆమెను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. వైద్య, కౌన్సిలింగ్ సహాయం తీసుకోవాలని తల్లి సూచించడంతో గురువారం ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో యువకుడు వెంట తెచ్చుకున్న ఇనుప రెంచ్‌తో తల్లి తలపై పలుమార్లు దాడి చేయడంతో ఆమె మృతి చెందింది. అనంతరం యువకుడే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి, రెంచ్‌ను స్వాధీనం చేసుకుని మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు.