తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. తిరువళ్లూరు జిల్లా పొన్నేరి తాలుకా ప్రభుత్వ వైద్యశాలలో రాజేశ్వరి (36) అనే మహిళ కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. సోమవారం విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరే సమయంలో ఓ వ్యక్తి ఆమె దగ్గరికి వచ్చాడు. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. మహిళను స్థానికులు కాపాడి ఆస్పత్రికి తరలించారు. రాజేశ్వరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.