వెనిజులాలో సంభవించిన భారీ భూకంపం ధాటికి వేలాది భవనాలు కుప్పకులాయి. అయితే ఈ శిథిలాల కింద వేలాది మంది చిక్కుకోగా రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. తాజాగా లా గువైరాలో నాలుగు రోజుల నుంచి శిథిలాల కింద చిక్కుకున్న ఓ యువకుడ్ని రెస్క్యూ టీమ్ సురక్షితంగా కాపాడింది. ఈ నేపథ్యంలోనే తనని కాపాడిన రెస్క్యూ సిబ్బందిని గట్టిగా కౌగిలించుకొని బాధిత యువకుడు భావోద్వేగానికి లోనయ్యాడు. దీంతో అక్కడున్న వారంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ విపత్తులో ఇప్పటిదాకా 1400 మందికి పైగా మృతి చెందారు.