ముంబైలో లోకల్ ట్రైన్ ఎక్కి ఓ యువకుడు హల్‌చల్ చేశాడు. చూనాబత్తి రైల్వే స్టేషన్‌లో మహిళల కోచ్‌లోకి ప్రవేశించి వీరంగం సృష్టించాడు. రైలులో కడ్డీని పట్టుకుని వేలాడుతూ.. తన షర్ట్ తీసేసుకుంటూ కనిపించాడు. ట్రైన్‌లో నుంచి దూకుతున్నట్లు ప్రవర్తించి అందరినీ భయభ్రాంతులకు గురి చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహిళల కోచ్‌లోకి వచ్చిన ఆ యువకుడిపై పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.