ఒంటికి టపాసులు చుట్టుకొని కాల్చుకున్న యువకుడు (వీడియో)

సోషల్ మీడియాలో ఒక యువకుడి వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ యువకుడు సాహసం పేరుతో తన ఒంటికి '1000 వాలా' చుట్టుకుని  టపాసులను కాల్చుకున్నాడు. ఈ క్రాకర్స్ పేలడం వల్ల అతని కాళ్లకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ఇది కేవలం ప్రమాదకర విన్యాసమని నెటిజన్లు అంటున్నారు. ఇలాంటి ప్రాణాపాయకరమైన పనులకు దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు.

సంబంధిత పోస్ట్