ఉత్తరప్రదేశ్‌లోని బాాగ్‌పత్ జిల్లాలో విచిత్ర చోరీ ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ-డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్ మార్గంలో రోడ్డు పక్కన నాటిన ఒక మొక్కను ఒక వ్యక్తి పీకేసుకెళ్లాడు. ఈ విచిత్ర చర్య మొత్తం అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం కావడంతో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ ఆ వ్యక్తి తీరును తప్పుబడుతున్నారు.