యువ ఫిజియోథెరపిస్ట్ అనుమానాస్పద మృతి.. అపస్మారక స్థితిలో ప్రియుడు

కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లాలో బెంగళూరుకు చెందిన సాయి సురభి (25) అనే యువ ఫిజియోథెరపిస్ట్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ముద్దేనహళ్లి సమీపంలోని ఒక హోమ్‌స్టేలో సోమవారం ఈ ఘటన వెలుగుచూసింది. యువతి మృతదేహంతో పాటు ఆమె ప్రియుడు, కేరళకు చెందిన సంజీత్ అలీ (26) అపస్మారక స్థితిలో కనిపించడంతో పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించారు. యువతి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని ప్రాథమికంగా నిర్ధారించారు. ఇది హత్యనా లేక ఆత్మహత్యనా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్