వైసీపీ నేత ప్రేమించి మోసం చేశాడని యువతి ఆత్మహత్యాయత్నం

AP: పల్నాడు జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. వైసీపీ నేత మోసం చేయడంతో ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వినుకొండలో ఎలుకల మందు తిని మస్తాన్‌బి అనే యువతి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కుటుంబీకులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైసీపీ నేత నాగూర్‌ మోసం చేశాడని మస్తాన్‌బి పోలీసులకు తెలిపింది. తనను ప్రేమించి వేరే యువతిని పెళ్లి చేసుకుంటున్నాడని మస్తాన్‌బి ఆరోపించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్