ప్రియుడి కోసం.. ప్రియురాలి ముక్కును కొరికిన యువతి

బీహార్‌లోని పాట్నాలో గర్దనీబాగ్ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఒక యువకుడి కోసం ఇద్దరు యువతులు ఘర్షణ పడ్డారు. పెళ్లి పేరుతో మోసం చేశాడని ఆరోపిస్తున్న ప్రియురాలు.. యువకుడితో వచ్చిన స్నేహితురాలి ముక్కును కొరికి గాయపరిచింది. ఈ ఘటనకు కారణం అర్వల్ జిల్లాకు చెందిన యువకుడు తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ప్రియురాలు ఆరోపించడం. బాధితురాలిని చికిత్స కోసం పాట్నా ఎయిమ్స్ తరలించారు. ఈ వివాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, కానీ ఎటువంటి ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕