తల్లి మందలించిందని యువతి ఆత్మహత్య

AP: ఏలూరు జిల్లాలోని వెల్లమిల్లి పంచాయతీ చింతాయిగూడెంలో విషాదం చోటు చేసుకుంది. టీ పెట్టలేదని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన అనూష (22) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు కిటికీలోంచి చూడగా, ఆమె ఫ్యాన్ ను చీరతో ఉరేసుకుని వేలాడుతూ కనిపించారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్