AP: వైఎస్సార్ జిల్లా, మైలవరం మండలంలో విషాదం చోటు చేసుకుంది. దొమ్మర నంద్యాలకు చెందిన 28 ఏళ్ల చిన్యం లావణ్య, బీటెక్ చదివినా ఉద్యోగం రాకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడింది. రైల్వే, ఇతర ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నా ఫలితం దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురైంది. దీంతో మధ్యాహ్నం రోడ్డు పక్కన పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఆ ప్రాంతంలో విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.