అన్నయ్యతో ప్రేమ.. యువతి ఆత్మహత్య

AP: తిరుపతిలోని రాజారెడ్డి కాలనీలో ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. ఒక యువతి తన పెద్దమ్మ కొడుకుతో ప్రేమలో పడి, అతన్నే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పింది. ఈ విషయం తెలిసి కుమార్తెను తల్లి మందలించింది. అన్నయ్యతో ప్రేమ, పెళ్లి ఏంటని గట్టిగా మందలించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన యువతి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మొదట రీల్స్ చేస్తూ పొరబాటున పడి మృతి చెందిందని భావించినా, విచారణలో ఇది ఆత్మహత్య అని తేలింది. ఘటనపైపోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్