సినిమా షూటింగ్స్‌కు వెళ్లొద్దన్నందుకు యువతి ఆత్మహత్య

TG: సికింద్రాబాద్‌ అల్వాల్‌ పరిధిలో మధులిక అనే యువతి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. తండ్రి మరణానంతరం తన బాబాయ్ వద్ద ఉంటున్న మధులిక, సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతూ కృష్ణానగర్‌లో జరిగే షూటింగ్‌లకు వెళ్తుండేది. అయితే, ఇలా షూటింగ్‌లకు వెళ్లొద్దని ఆమె బాబాయ్ మందలించడంతోనే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాబాయ్ హెచ్చరిక వల్లే యువతి ఆత్మహత్య చేసుకుందని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్

✕
✕