నిశ్చితార్థం వేళ యువతి ఆత్మహత్య

AP: విజయనగరం జిల్లా గరివిడి మండలంలో విషాదం చోటుచేసుకుంది. తోండ్రంగి గ్రామానికి చెందిన అఖిల (22), అదే గ్రామానికి చెందిన వివాహితుడు రాము ప్రేమించుకుంటున్నారు. యువతికి పెద్దలు కుదిర్చిన వ్యక్తితో గురువారం నిశ్చితార్థం జరగాల్సి ఉంది. ఈ విషయం తెలియడంతో అఖిలను రాము బెదిరించాడు. పురుగుల మందు ఇచ్చి.. ‘నువ్వు చావకపోతే మన విషయం చెప్పి పెళ్లి చెడగొడతా’ అని బ్లాక్ మెయిల్ చేశాడు. దాంతో యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్