పెళ్లైన రెండు నెలలకే యువతి ఆత్మహత్య

TG: పెళ్లైన రెండు నెలలకే ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మహబూబ్‌నగర్(D) కొత్తకోట(D) కనిమెట్ట గ్రామానికి చెందిన ఉషారాణి (20), దేవరకద్ర(M) నాగారం గ్రామానికి చెందిన మల్లేష్‌కు జూన్ 25న వివాహమైంది. పెళ్లయిన నెల రోజులకే ఆ యువతికి వరకట్నం వేధింపులు మొదలయ్యాయి. ఈ విషయం తల్లిదండ్రులతో చెప్పగా నచ్చజెబుతూ వచ్చారు. తాజాగా అత్తింటి వేధింపులు తీవ్రం కావడంతో పుట్టింటికి వచ్చేసింది.  మంళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తల్లి పద్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విక్రమ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్