విద్యుత్ షాక్‌తో యువతి మృతి

TG: సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం ఏపూరు గ్రామం బోడ తండాకు చెందిన 17 ఏళ్ల బోడ ప్రణీత విద్యుత్ షాక్‌తో మృతి చెందింది. ఈ ఘటనపై మృతురాలి తల్లిదండ్రులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పక్క తండాకు చెందిన నరేష్ అనే వ్యక్తి వేధింపులే తమ కుమార్తె మరణానికి కారణమని, అతడే యువతిని ట్రాన్స్‌ఫార్మర్‌పైకి నెట్టి హత్య చేశాడని వారు ఆరోపించారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ, ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕