TG: హైదరాబాద్ మెహిదీపట్నంలోని బ్లిస్ ఆస్పత్రిలో సబాబేగం అనే యువతి మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆమె చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆందోళన చేశారు. బాధిత కుటుంబాన్ని నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ పరామర్శించారు. న్యాయం కోసం కుటుంబానికి అండగా ఉంటామని, ఆస్పత్రిపై కేసు విషయంలో ముందుకెళ్తామని స్పష్టం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక, పోలీసుల దర్యాప్తు తర్వాతే మృతికి గల కారణాలు తెలియనున్నాయి.