ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లోని జలపాతాలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ జలపాతాన్ని చూసేందుకు వెళ్లిన ఓ యువతి ప్రమాదవశాత్తూ అందులో జారిపడింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే సదరు యువతి జలపాతం దగ్గరగా వెళ్లేందుకు ట్రై చేసింది. ఈ క్రమంలో కొండ పైనుంచి జారీ జలపాతంలో పడింది. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియరాలేదు.