హర్యానాలోని బహదూర్‌గఢ్‌లోని తిక్రి సరిహద్దు సమీపంలోని ఓ రెస్టారెంట్‌లో ఐదుగురు యువకులు ఒక యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఆ యువతి పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. కానీ యువతిని హైవే నుంచి ఈడ్చుకుంటూ వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ కావడంలో వెలుగులోకి వచ్చాయి. దాని ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా బాధితురాలు పని కోసం తన మామతో కలిసి బస్సులో బహదూర్‌గఢ్‌కు వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు.