ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సోనియా అనే మహిళ తన కొత్త ప్రియుడు సాదిక్‌తో కలిసి తన మాజీ ప్రియుడు సంజీవ్‌ను దారుణంగా హత్య చేసింది. 12 ఏళ్లుగా సంజీవ్‌తో ప్రేమలో ఉన్న సోనియా, సాదిక్‌తో సంబంధం ఏర్పడిన తర్వాత వారిద్దరూ కలిసి సంజీవ్‌ను చంపాలని కుట్ర పన్నారు. సోనియా తన అద్దె ఇంటికి సంజీవ్‌ను ఆహ్వానించగా, అక్కడ దాక్కున్న సాదిక్‌తో కలిసి అతన్ని తాడుతో గొంతు కోసి చంపింది. అనంతరం, మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి కాలువలో పడేశారు.