బర్త్‌డే పార్టీకి పిలిచి యువతిపై అత్యాచారం

TG: బర్త్ డే పార్టీకి వచ్చిన యువతిపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటన మేడ్చల్ బాలానగర్ పీఎస్ పరిధిలో జరిగింది. నెల రోజుల క్రితం ఇన్‌స్టాలో పరిచయమైన సిద్ధారెడ్డి (24) అనే యువకుడు సదరు యువతిని పుట్టినరోజు వేడుకలకు పిలిచాడు. ఆ తర్వాత మద్యం తాగించి అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్