పుట్టినరోజు వేడుకలో యువతిపై అత్యాచారం

బెంగళూరులోని తలఘట్టపుర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. పుట్టినరోజు వేడుకకు పిలిచి ఒక యువతిపై ఐదుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకడైన సోమశేఖర్ అనే వ్యక్తి బాధితురాలికి పరిచయస్తుడు. ఆమె పుట్టినరోజు సందర్భంగా పార్టీకి ఆహ్వానించి యువతిని తలఘట్టపురలోని తన గదికి తీసుకెళ్లాడు. అక్కడ అంబరీష్ తనకు జ్యూస్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి అత్యాచారం చేశారని బాధితురాలు తెలిపింది.

సంబంధిత పోస్ట్