కూలింగ్ కెనాల్‌లో దొరికిన యువతి తల

AP: ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం, వీటీపీఎస్ కూలింగ్ కెనాల్‌లో శుక్రవారం యువతి మొండెం లభ్యం కాగా, ఇవాళ తల దొరికింది. యువతిని అత్యంత దారుణంగా హత్య చేసి, తల, చేతులు, కాళ్లు నరికినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, పోలీసులు విచారణ చేపట్టారు. ఈ దారుణ హత్య కేసులో నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕