కాబోయే భర్తకు కఠిన షరతులు.. నెట్టింట యువతి పోస్ట్ వైరల్!

సోషల్ మీడియాలో ఓ యువతి తన కాబోయే భర్తకు ఉండాల్సిన అర్హతలను వివరిస్తూ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఆమె కోరుకుంటున్న భర్త జీతం నెలకు కనీసం రూ. 2 లక్షలు, 6 అడుగుల ఎత్తు, గ్రీకు వీరుడిలా అందంగా ఉండాలని షరతు విధించింది. పెళ్లికి ముందు, తర్వాత ఎలాంటి గర్ల్‌ఫ్రెండ్స్ ఉండకూడదని, వంట చేయడం, ఇంటి పనులు చేయడంలో సహాయపడాలని కోరింది. ముఖ్యంగా భర్త తన 24 గంటల లైవ్ లొకేషన్‌ను ఎప్పుడూ భార్యతో షేర్ చేయాలని కోరడం నెటిజన్ల విమర్శలకు దారితీసింది. కొందరు ఆమెను ట్రోల్ చేస్తుండగా, మరికొందరు ఇది నమ్మకం లేని బంధానికి నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్