అస్సాంలోని శివసాగర్‌లో దారుణం చోటుచేసుకున్నది. పెళ్లి కాకుండానే తల్లైన 22 ఏళ్ల యువతి, నవజాత శిశువును హాస్పిటల్ ఆవరణలోనే రూ.50వేలకు అమ్మేసింది. హాస్పిటల్ సిబ్బంది చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సమాచారం ఇచ్చినా, జూలై 10న అమ్మకాన్ని అడ్డుకోలేకపోయారు. పోలీసులు యువతితో పాటు ఆమె తల్లి, ఆశా కార్యకర్తను అరెస్ట్ చేశారు. శిశువు ఎక్కడ ఉందన్న దానిపై గాలింపు కొనసాగుతోంది.