3 రోజులుగా తల్లి సమాధి వద్ద యువతి నిద్ర (వీడియో)

TG: కరీంనగర్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తన తల్లి మరణాన్ని తట్టుకోలేక ఓ యువతి మూడు రోజులుగా కబరస్తాన్‌ సమాధి వద్దే పగలు–రాత్రి తేడా లేకుండా నిద్రిస్తోంది. యువతి పరిస్థితిని చూసిన కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విషయం తెలిసిన షీ టీమ్స్, సఖి టీం, మహిళా సంక్షేమ శాఖ అధికారులు యువతిని రక్షించేందుకు, అవసరమైన వైద్య సహాయం అందించేందుకు చర్యలు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్