విశాఖలో యువకుడిపై కత్తితో దాడి (వీడియో)

AP: విశాఖలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని డాబా గార్డెన్స్, జాకీ షోరూమ్ వద్ద శెట్టి ఎల్లాజీ అలియాస్ వడ్డీ(21) అనే యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన ఎల్లాజీని పోలీసులు కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే త్రీటౌన్ సీఐ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్