కలెక్టరేట్‌లో యువకుడు ఆత్మహత్యాయత్నం(వీడియో)

AP: కడప కలెక్టరేట్లో ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. సదరు వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. చాపాడుకు చెందిన శెట్టిపల్లి విశ్వనాథరెడ్డి తన భార్యకు ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించాడు. అయితే ఈ చికిత్స అనంతరం ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైందని.. దీనికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించాడు. ఈ మేరకు తనకు న్యాయం చేయాలని కలెక్టరేట్లో అతను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

సంబంధిత పోస్ట్